Thursday , 19 October 2017

Home » Slider News » కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం

September 20, 2017 10:23 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం A+ / A-

ఏడుగురి మృతి

kaleshwaram tunnel తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్‌ మార్గంలో బుధవారం పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణహిత-చేవేళ్ల 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనుల వద్ద ఎయిర్ బ్లాస్టింగ్‌ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.

కాళేశ్వరం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కాంట్రాక్టు ఏజెన్సీ రూ. 5 లక్షల చొప్పన సాయం ప్రకటించింది. కాగా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం Reviewed by on . ఏడుగురి మృతి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఏడుగురి మృతి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల Rating: 0

Related Posts

scroll to top