Friday , 16 November 2018

Home » Slider News » కారు ఖార్ఖానాకు…కెసిఆర్ ఫాం హౌజ్ కు

కారు ఖార్ఖానాకు…కెసిఆర్ ఫాం హౌజ్ కు

November 10, 2018 10:58 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on కారు ఖార్ఖానాకు…కెసిఆర్ ఫాం హౌజ్ కు A+ / A-

ఏబీపీ-సీ ఓటర్ సర్వే… టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం

car trsతెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అనేక సంస్థలు మీడియా  హౌజ్ లు అనేక..అనేక సర్వేలు చేసి జోస్యాలు చెప్పాయి. ఇందులో మెజార్టి సర్వేలు  టిఆర్ఎస్ కు అనుకూల జోస్యాలు చెప్పగా తాజాగా ఏబీపి- సి సర్వే మాత్రం కారు ఖర్ఖానాకే అంటూ సంచలన సర్వే ఫలితం వెల్లడించింది. ఈసంస్థ సర్వేలు గతంలో నూటికి నూరు శాతం నిజం అయ్యాయట. మరి తెలంగాణ లో అదే జరిగితే….కారు ఖార్ఖానాకు వెళితే కెసిఆర్ పరిస్థితి ఇక ఫాంహౌజే అని అంటున్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లి… మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏబీపీ-సీ ఓటర్ సర్వే షాకిచ్చింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని సర్వే తేల్చి చెప్పింది.

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం మహాకూటమికి కలిసొచ్చిందని సర్వే అభిప్రాయపడింది. ఈ సర్వేలో మహాకూటమి 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..

అలాగే కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ కేవలం 42 స్థానాలకే పరిమితమవుతుందని.. బీజేపీ 4, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది. గత ఎన్నికల్లో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా పడిపోతుందని సర్వే తెలిపింది.

మహాకూటమికి 33.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా.. టీఆర్ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే సర్వేలో, పాల్గొన్న వారిలో 42.9 శాతం మంది కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారట. ఆ తర్వాతి స్థానంలో జానారెడ్డి ఉన్నారు.. ఆయన సీఎం అవ్వాలని 22.6 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.

సెప్టెంబర్‌లో మహాకూటమి ఏర్పడింది..తొలుత కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో ప్రారంభమైన కూటమిలో ఆ తర్వాత తెలంగాణ జన సమితి (టీజేఎస్) వచ్చి చేరింది. తొలుత టీఆర్ఎస్‌కు జనంలో ఊపు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు

కారు ఖార్ఖానాకు…కెసిఆర్ ఫాం హౌజ్ కు Reviewed by on . ఏబీపీ-సీ ఓటర్ సర్వే... టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అనేక సంస్థలు మీడియా  హౌజ్ లు అనేక..అనేక సర్వేలు చేసి జోస్యాలు చెప్పా ఏబీపీ-సీ ఓటర్ సర్వే... టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అనేక సంస్థలు మీడియా  హౌజ్ లు అనేక..అనేక సర్వేలు చేసి జోస్యాలు చెప్పా Rating: 0
scroll to top