Monday , 20 May 2019

Home » Slider News » కలెక్టర్ ఔదార్యానికి ప్రశంసలు

కలెక్టర్ ఔదార్యానికి ప్రశంసలు

January 2, 2019 10:06 am by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on కలెక్టర్ ఔదార్యానికి ప్రశంసలు A+ / A-

Collectorఆదిలాబాద్ జిల్లా కలెక్టర్  దివ్యదేవరాజన్ నూతన సంవత్సర వేడుకల్లో తీసుకున్న నిర్ణయం అందరి చేతి ప్రశంసలు పొందింది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడి పోయిన జిల్లాలో హాస్టల్ విద్యార్థులకు పేదలకు బ్లాంకెట్లు అంద చేయాలని సంకల్పించిన కలెక్టర్ నూతన సంవత్సర వేడుకల్లో పుష్పగుచ్చాలు అంద చేసే బదులు దుప్పట్లు  అంద చేయాలని సూచించారు. దాంతో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిజేసేందుకు వచ్చే అధికారులు, సి బ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు బొకేలు, మిఠాయిలకు బదులు దుప్పట్లు, శాలువాలు తీసుకు వచ్చారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది దుప్పట్లు, శాలువాలను తీసుకు వచ్చి కలెక్టర్‌కు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్ని శాఖల అధికారులతో పాటు పోలీసు, అటవీ, జైలు శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. దాదాపు 500కు పైగా దప్పట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కలెక్టర్ ఔదార్యానికి ప్రశంసలు Reviewed by on . ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్  దివ్యదేవరాజన్ నూతన సంవత్సర వేడుకల్లో తీసుకున్న నిర్ణయం అందరి చేతి ప్రశంసలు పొందింది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడి పోయిన జిల్లాలో హాస్టల్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్  దివ్యదేవరాజన్ నూతన సంవత్సర వేడుకల్లో తీసుకున్న నిర్ణయం అందరి చేతి ప్రశంసలు పొందింది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడి పోయిన జిల్లాలో హాస్టల్ Rating: 0
scroll to top