Tuesday , 25 June 2019

Home » Slider News » కలెక్టర్‌ను ఉరికించి కొట్టిన రైతులు

కలెక్టర్‌ను ఉరికించి కొట్టిన రైతులు

June 7, 2017 7:22 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on కలెక్టర్‌ను ఉరికించి కొట్టిన రైతులు A+ / A-

farmers on collector 44భోపాల్‌: దేశానికి అన్నంపెట్టే రైతులకు ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ కలెక్టర్ చవిచూశాడు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాందసౌర్‌లో మంగళవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయిన విషయం తెలిసిందే. రైతుల మృతికి సానుభూతిగా బుధవారం అక్కడ బంద్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే సమయంలో ఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించేందుకు కలెక్టర్ స్వతంత్ర కుమార్ పోలీసులతో కలిసి వచ్చారు. అధికారులను చూసిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కలెక్టర్‌ సహా ఇతర అధికారులపై దాడికి యత్నించారు. తరిమి తరిమి దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసుల సాయంతో కలెక్టర్ దాడుల నుంచి తప్పించుకున్నారు.

మాందసౌర్‌లో గత వారం రోజులుగా తమ పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు మంగళవారం రోడ్లపైకి వచ్చి తమ ఆందోళనను తీవ్రం చేశారు. రహదారులను ఎక్కడికక్కడ బ్లాక్‌ చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు వచ్చిన భద్రతా బలగాలు.. వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయారు.

కలెక్టర్‌ను ఉరికించి కొట్టిన రైతులు Reviewed by on . భోపాల్‌: దేశానికి అన్నంపెట్టే రైతులకు ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ కలెక్టర్ చవిచూశాడు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్ భోపాల్‌: దేశానికి అన్నంపెట్టే రైతులకు ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ కలెక్టర్ చవిచూశాడు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్ Rating: 0
scroll to top