Friday , 19 July 2019

Home » Slider News » ఓటమికి ఇవిఎంలు కారణం కాదు..కోదండరాం

ఓటమికి ఇవిఎంలు కారణం కాదు..కోదండరాం

January 1, 2019 6:47 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on ఓటమికి ఇవిఎంలు కారణం కాదు..కోదండరాం A+ / A-

PITTALA RAVINDER ON KODANDARAMహైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమన్నవాదన సరైంది కాదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎన్నికల తరువాత మొదటిసారిగా ఆయన ఆంధ్రజ్యోతి చిట్‌చాట్‌లో మాట్లాడారు. కూటమి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని ఆ కారణంగానే పరాభవం చెందామన్నారు. ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని తాను చెప్పానని, అయినప్పటికీ ప్రచారానికి 3 వారాలు చాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు అన్నారంటూ కోదండరాం చెప్పారు. తాను లోక్‌సభకు పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్‌ఫ్రంట్‌కు అవకాశం లేదని అన్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఎవరి కోసమో కేసీఆర్‌కే తెలియాలన్నారు. కేసీఆర్ ఏపీలో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ..కేసీఆర్ ఏపీలో పోటీ చేస్తే ఎక్కువ లాభం చంద్రబాబుకే దక్కుతుందని కోదండరామ్ అన్నారు.

ఓటమికి ఇవిఎంలు కారణం కాదు..కోదండరాం Reviewed by on . హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమన్నవాదన సరైంది కాదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎన్నికల తరువాత మొదటిసారిగా ఆయన ఆంధ్రజ్యోతి చి హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమన్నవాదన సరైంది కాదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఎన్నికల తరువాత మొదటిసారిగా ఆయన ఆంధ్రజ్యోతి చి Rating: 0
scroll to top