Wednesday , 22 August 2018

Home » Slider News » ఎసిబి కేసులపై పునరాలోచనవద్దు…సిఎం కెసిఆర్ కు ప్రజాసేన విజ్ఞప్తి

ఎసిబి కేసులపై పునరాలోచనవద్దు…సిఎం కెసిఆర్ కు ప్రజాసేన విజ్ఞప్తి

July 19, 2018 7:49 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on ఎసిబి కేసులపై పునరాలోచనవద్దు…సిఎం కెసిఆర్ కు ప్రజాసేన విజ్ఞప్తి A+ / A-
ఎసిబి కేసుల విషయంలో పునరాలోచన తగదని అవినీతి నిరోధక స్వచ్చంద సేవా  సంస్థ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు పుప్పాల రజని కాంత్  తెలంగాణ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సిఎం కెసిఆర్ కు బహిరంగ లేఖ రాసారు.
ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ
ANTI CURRUPTIONమిషన్ కాకతీయ,మిషన్ భగీరథ,హరిత హారం,కళ్యాణ లక్ష్మి,షాదీ ముభారక్,మొదలగునవి మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఎన్నోమహోత్తర కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడిన  4   ఏళ్లలోనే చేపట్టి దేశంలోనే ప్రతి రాష్ట్రం మన తెలంగాణ వైపు చూసేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  KCR గారికి ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ తరుపున ధన్యవాదాలు.అవినీతి రహిత తెలంగాణ కోసం  లంచం అడిగితే చెప్పుతో కొట్టండి,లంచం అడిగితే ఒక ఫోన్ చేయండి అని మీరు చెప్పిన మాటలకు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మరియు మేము ముగ్దులమయ్యాము మరియు ముఖ్యంగా మీకు అభిమానులమయ్యాము. కాని మీరు ఇచ్చిన ఆ ఫోన్ నంబర్ తో న్యాయం జరగడం లేదు.అధికారుల తప్పిదమా లేదా నిర్లక్షమా తెలియడం లేదు.మేము మరియు  ముఖ్యంగా మీరు కలలు కన్నబంగారు తెలంగాణ సాధించాలంటే ఒక్క మీ పథకాలతోనే  సాధ్యం కాదని మా యొక్క అభిప్రాయం..మన రాష్ట్రంలో ఉన్న అవినీతి పోయిన నాడు మాత్రమే బంగారు తెలంగాణ సాధ్యం.జులై 14 న “ఏసీబీ వేధింపుల నుంచి ఉద్యోగులకు విముక్తి!,ఆదాయానికి మించి ఆస్తుల కేసులపై త్వరలో సర్కారు కీలక విధాన నిర్ణయం,సమీక్షకు సీఎం ఆదేశం,ఏసీబీ చీఫ్ కు ఫోన్,సురేష్ కుమార్ కేసుపై పునఃపరిశీలన ” అనే శీర్షిక ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైంది.దీని వల్ల చాలా మంది ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న అవీనీతి  ఉద్యోగులు తప్పించుకునే అవకాశం ఉంది.ఒక వేళ నీటిపారుదల శాఖ లో పనిచేసే సురేష్ కుమార్ గారి కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు తప్పుడు కేసు* *పెట్టినట్లయితే న్యాయస్థానం ద్వారా ACB అధికారులు కూడా శిక్షించబడుతారు.ACB అధికారులు ఇలాంటి కేసులు చేసేటప్పుడు,ట్రాప్ లు చేసేప్పుడు వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేస్తారని ఒక అవినీతి నిరోధక స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక* *అధ్యక్షుడిగా నా యొక్కఅభిప్రాయం.తెలంగాణ అమర వీరులకు ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా లంచం తీసుకుంటున్న అధికారులున్నారు.రైతు భందు పధకంలోని డబ్బులు ఇవ్వడానికి కూడా లంచం తీసుకుంటున్నారు. కొంత మంది ట్రాఫిక్ పోలీసులు వాహనాల చెకింగ్ పేరుతో వాహన దారుల  నుండి డబ్బులు లాగుతున్నారు. మరికొంత మంది అధికారులు ప్రభుత్వ నిదుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.ఇలాంటి వారిని పట్టుకునేందుకు ACB అధికారులకు విశేషాధికారాలు ఇస్తే మన రాష్ట్రం అవినీతి రహిత తెలంగాణ అవుతుంది. బంగారు తెలంగాణ అవుతుంది. సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని మా  అభిప్రాయం.ఇక సురేష్ కుమార్ గారి కేసు విషయంలో మిమ్మల్ని కలిసిన ఉద్యోగులకు సురేష్ కుమార్ గారి ఆస్తుల విషయంలో ACB అధికారుల కంటే పూర్తి అవగాహన ఉందా.? ఒక వేళ పూర్తి అవగాహన ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మంచిదని మా యొక్క అభిప్రాయం. అంతే గాని ఇలాంటి కేసుల విషయంలో పునఃపరిశీలన చేస్తే ప్రజలకు మీ పై, ప్రభుత్వంపై మరియు అవినీతి నిరోధక శాఖ పై నమ్మకం పోయే అవకాశం ఉంది. మీ పథకాలకు తోడు,అవినీతి పరుల పై ఇంకా కటిన చర్యలు తీసుకుంటే మనం మంచి ఫలితాలు సాదించవచ్చు.కావున పునఃపరిశీలన పై మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు న్యాయం చేకూర్చగలరని మా మనవి.
కృతజ్ఞతలతో
PUPPALA RAJANIKANTH
FOUNDER PRESIDENT 
PRAJASENA
ANTI CORRUPTION-VOLUNTARY SOCIETY
REGD.NO. 131/2014
CELL:9133179776
ఎసిబి కేసులపై పునరాలోచనవద్దు…సిఎం కెసిఆర్ కు ప్రజాసేన విజ్ఞప్తి Reviewed by on . ఎసిబి కేసుల విషయంలో పునరాలోచన తగదని అవినీతి నిరోధక స్వచ్చంద సేవా  సంస్థ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు పుప్పాల రజని కాంత్  తెలంగాణ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. ఎసిబి కేసుల విషయంలో పునరాలోచన తగదని అవినీతి నిరోధక స్వచ్చంద సేవా  సంస్థ ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు పుప్పాల రజని కాంత్  తెలంగాణ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. Rating: 0
scroll to top