Thursday , 19 October 2017

Home » Slider News » ఎన్టీఆర్ కు పార్టి పెట్టమని సలహా ఇచ్చింది…….నేనే … ఎపి సిఎం చంద్రబాబు

ఎన్టీఆర్ కు పార్టి పెట్టమని సలహా ఇచ్చింది…….నేనే … ఎపి సిఎం చంద్రబాబు

March 30, 2017 10:50 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Leave a comment A+ / A-

cnb and ntrసలహాలు ఇవ్వడంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడును మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. అమెరికా ప్రెసిడెంట్ నుండి మొదలు ఆవకాయ పచ్చడి తయారు చేసే వాళ్ల వరకు అందరూ బాబు గారి సలహాలు స్వకరించిన వారే.  ప్రపంచ ధిగ్గజాల పేరు చెబితే చాలు ఏదో ఒక సందర్భంలో వారికి ఇచ్చిన సలహాల గురించి చంద్రబాబు నాయుడు సెలవిస్తారు. అది కూడ ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పేస్తారు మరి. వినే వాళ్లు ఉండాలే గాని నారా చంద్రబాబు నాలుక ఎన్ని సలహాలు అయినా ఇస్తుంది. ఆయన నాలుక అట్లాంటిది మరి. చంద్రబాబు నాయుడు తాజాగా మరో సలహా ముచ్చట చెప్పాడు. మామ ఎన్టీఆర్ కు పార్టి పెట్టమని సలహా ఇచ్చిందెవరో తెల్సా  అల్లుడు చంద్ర బాబు నాయుడే నట. ఉగాది పండగ రోజు గుంటూరులో జరిగిన పార్టి కార్యకర్తల సమావేశంలో బాబు  తన సలహా పంచాంగం విప్పాడు.

కాంగ్రేస్ పార్టీలో తాను సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్నపుడు ఈ వ్యవస్థ పట్ల విసుగెత్తి పోయానని వ్యవస్థను బాగు చేసేందుకు మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి మామా అంటూ పార్టీ పెట్టాలని సలహా ఇచ్చినందుకు ఎన్టీఆర్ పార్టి పెట్టాడని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు చెబుతుంటే పార్టీలో సీనియర్ కార్యకర్తలు నోళ్లు వెళ్ల బెట్టారట. ఎన్టీఆర్ పార్టి పెట్టినపుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రేస్ లో ఉన్నాడు. పోని ఎన్టీఆర్ తన సలహా పాటించే పార్టీ ఏర్పాటు చేసాడే అనుకుందాం….. బాబెందుకు తెలుగుదేశం పార్టీలో చేర లేదు ? 30 ఏళ్ల పై బడిన మాట  ఇది. ఆం… ఎవరికి గుర్తుంటుందని బాబు భలే కథ అల్లాడు కాని తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పార్టి పెట్టినప్పుడు ఆయనతో ఉన్న సీనియర్లు ఆ తర్వాత వేరే పార్టీలో చేరి ఉండవచ్చుకాని ఇంకా బతికే ఉన్నారు మరి. అంతెందుకు నాదెండ్ల భాస్కర్ రావు…..ఈ పేరు తెలియని వారు ఉండక పోవచ్చు. ఎన్టీఆర్ కు మొదట్లో పార్టి పెట్టేందుకు సహకరించిన వారిలో ముఖ్యుడు. ఆ తర్వాత ఆయన ఇందిరా గాంధి ప్రోత్సాహంతో  ఎన్టీఆర్ ను పదవి చ్యుతిడిని చేసిన ఘనుడిగా చరిత్ర కెక్కాడు.

 

చంద్రబాబు నాయుడు ఎప్పుడు పార్టీలో చేరాడో ఆ తర్వాత అదును కోసం  వేచి చూసి….మామ ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి ఆయనను పదవి నుండి దించి ముఖ్యమంత్రి  ఎట్లా అయ్యాడో ఎవరికి తెలియదనుకున్నాడేమో. బాబు అబద్దాలు చెబితే అతికినట్లు ఉంటే ఏ సమస్యా వచ్చేది కాదు. ఆయన చెప్పేవన్ని అట్లా లేకనే ఈ శ్రవణానందం.

ఎన్టీఆర్ కు పార్టి పెట్టమని సలహా ఇచ్చింది…….నేనే … ఎపి సిఎం చంద్రబాబు Reviewed by on . సలహాలు ఇవ్వడంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడును మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. అమెరికా ప్రెసిడెంట్ నుండి మొదలు ఆవకాయ పచ్చడి తయారు చేసే వాళ్ల వరకు అందరూ బాబు గ సలహాలు ఇవ్వడంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడును మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. అమెరికా ప్రెసిడెంట్ నుండి మొదలు ఆవకాయ పచ్చడి తయారు చేసే వాళ్ల వరకు అందరూ బాబు గ Rating: 0

Related Posts

scroll to top