Tuesday , 16 October 2018

Home » ఫోకస్ » ఎంగిలి విస్తర్లపై దళితుల పొర్లు దండాలు

ఎంగిలి విస్తర్లపై దళితుల పొర్లు దండాలు

September 13, 2016 3:09 pm by: Category: ఫోకస్ Leave a comment A+ / A-

బ్రాహ్మణులు తిని వదలేసిన ఎంగిలి విస్తరి ఆకులపై దళితులు పడుకుని పొర్లుదండాలు పెట్టే ఆచారం తమిళ నాడు, కర్నాటక రాష్ర్టాలలో కొన్ని ప్రాంతాలలో కొనసాగుతోంది. కొన్ని ఆచారాలు ఎందుకు ప్రవేశ పెడతారో ఎవరు ప్రవేశ పెడతారో కాని ఈ ఆచారాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.తిని పడేసిన విస్తరాకులు ఆలయం చుట్టూ పరిచి దళితులను వాటిపై పొర్లు దండాలు పెట్టిస్తుంటారు. దళితులు కూడ వాటిపై పొర్లితే రోగాలు నయమవుతాయని విశ్వసిస్తుంటారు.ఈ అనాగరిక ఆచారాన్ని రూపు మాపేందుకు పౌరహక్కుల సంఘాలు, హేతు వాద సంఘాలు విఫల యత్నాలు చేసాయి.అయినా దళితులు ఈ ఆచారాన్ని మాన లేదు. తరతరాలు,యుగయగాల ఆచారమంటూ ఆలయాల్లో కూడ ఈ తంతును నిలిపి వేయ లేదు.
చివరికి కేంద్రం ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించింంది.ఒక్కసారిగా దళితులపై కేంద్రానికి ఎట్లా ప్రేమ పుట్టుకు వచ్చిందంటే త్వరలో ఉత్తరాదిలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాలలో ఎన్నికలు జరుగ బోతున్నాయి.ఉత్తరాధిలో ఇప్పటికే దళితులపై హిందుత్వముసుగులో ఉన్న గోరక్షక దళాల దాడుల కారణంగా బిజెపి పరువు పోయింది.దాంతో దళితుల విస్వాసం పొందేందుకు కేంద్రం ఇలా సుప్రీం కోర్టును ఆశ్రయించిందనే వాదనలు విని పిస్తున్నాయి.
‘మడే స్నాన’ పేరిట కొనసాగుతున్న ఈ ఆచారాన్ని పూర్తిగా నిషేదించాలని కోరుతూ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టును కోరింది. అయితే ఇదంతా ఎవరు బలవంతంగా చేయించడం లేదని ఇష్ట పూర్వకంగా చేస్తున్నారని ప్రతి వాదులు వాదించారు.అయితే సుప్రీం కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించ లేదు.

కర్ణాటకలోని దక్షణి కనర జిల్లాలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి ఏటా మూడు రోజులపాటు ఇలాంటి పొర్లు దండాల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నవంబర్, డిసెంబర్ మధ్యలో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి.తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఏటా ఏప్రిల్‌లో నెరూర్ సదాశివ బ్రహ్మేంద్ర టెంపుల్‌లో ఆరాధనోత్సవాలు జరుగుతాయి.

ఎంగిలి విస్తర్లపై దళితుల పొర్లు దండాలు Reviewed by on . బ్రాహ్మణులు తిని వదలేసిన ఎంగిలి విస్తరి ఆకులపై దళితులు పడుకుని పొర్లుదండాలు పెట్టే ఆచారం తమిళ నాడు, కర్నాటక రాష్ర్టాలలో కొన్ని ప్రాంతాలలో కొనసాగుతోంది. కొన్ని ఆ బ్రాహ్మణులు తిని వదలేసిన ఎంగిలి విస్తరి ఆకులపై దళితులు పడుకుని పొర్లుదండాలు పెట్టే ఆచారం తమిళ నాడు, కర్నాటక రాష్ర్టాలలో కొన్ని ప్రాంతాలలో కొనసాగుతోంది. కొన్ని ఆ Rating: 0
scroll to top