Monday , 20 May 2019

Home » Slider News » ఉరికంభం ఎక్కే ముందు భగత్ సింగ్ చివరి సందేశం ఏమిటి ?

ఉరికంభం ఎక్కే ముందు భగత్ సింగ్ చివరి సందేశం ఏమిటి ?

March 24, 2017 11:28 am by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-
BHAGAT SINGH LETTERఉరి తియ్యటానికి ఒక్కరొజుముందు భగత్ సింగ్ రాసిన లేఖ ఇది (22-03-1931)
కామ్రేడ్స్!
జీవించి ఉండాలి అన్న కోరిక నాకు లేదు అని చెప్పదలుచు కోలేదు. కాని జీవించడమంటు జరిగితే శాశ్వతంగా జైలు గోడల మద్య బందనాలలొ బ్రతకాలి అని నాకు లేదు.
ఈ రోజు నా పేరు హిందుస్తాన్ విప్లవ పార్టీకి పర్యాయపదం గా తయారు అయింది. విప్లవ పార్టీ ఆశయాలు ,ఉజ్వల బలిదానాలు నన్ను అత్యున్నత స్తానం లొ నిలిపాయి. బహుశా నేను బ్రతికి ఉన్నా ఎప్పటికి అందుకోలేనంత ఎత్తుకి చేరుకున్నాను. ఇప్పుడు ప్రజల ద్రుష్టి లో నేను బలహీనుడను కాదు. నేనే కనక ఉరి తప్పించుకుని బయటకు వస్తే ఆ బలహీనతలు బహిర్గతం కావచ్చు. విప్లవ కేంద్ర ప్రభావం పల్చపడవచ్చు .ముగిసి పోవచ్చు కూడా. నేను ధైర్యంగా నవ్వుతూ ఉరికంబం ఎక్కినట్టు అయితే దేశం లో తల్లులు తమ పిల్లలని భగత్ సింగ్ కావాలి అని కోరుకుంటారు . తద్వారా దేశ దాస్య విముక్తి కోసం ఆత్మార్పణ చెసే మరెందరొ తయారు అవుతారు. సామ్రాజ్యవాదం సర్వ శక్తులూ పెనుగులాడినా విప్లవాన్ని అడ్డుకోలేని స్థితి వస్తుంది.
ఈ సమయం లో ఒక బావన నాలోతరచూ తలెత్తుతున్నది . దేశం కోసం, మానవాళి కోసం అనుకున్నదానిలోసగం కూడా నెరవేర్చలేకపొయాను. నేను కనక ఒక వేల బ్రతికి ఉంటే ఇవన్ని పూర్తి చేయటానికి అవకాశం లబించేదేమో. అప్పుడు నా ఆలోచనలు ఆచరణలో పెట్టగలిగే వాడిని. ఈ ఒక్క కొరత తప్ప నా హ్రుదయం లో ఉరి శిక్షను తప్పించుకోవాలి అని ఎలాంటి ప్రలోభము లేదు. నాకన్నా ఎక్కువ అద్రుష్టవంతులు ఎవరు ఉంటారు? ఇటీవల కాలం లొ నన్ను చూస్తే నాకే గర్వం కలుగుతోంది. ఆఖరి పరీక్ష కోసం మనస్సు ఎంతో ఆదుర్ధా గా నిరీక్షిస్తోంది. అది మరింత త్వరగా రావాలని కొరుకుంటుంది.
ఇక సెలవు
మీ సహచరుడు భగత్ సింగ్
వాట్సప్ సంగ్రహణ
ఉరికంభం ఎక్కే ముందు భగత్ సింగ్ చివరి సందేశం ఏమిటి ? Reviewed by on . ఉరి తియ్యటానికి ఒక్కరొజుముందు భగత్ సింగ్ రాసిన లేఖ ఇది (22-03-1931) కామ్రేడ్స్! జీవించి ఉండాలి అన్న కోరిక నాకు లేదు అని చెప్పదలుచు కోలేదు. కాని జీవించడమంటు జరిగ ఉరి తియ్యటానికి ఒక్కరొజుముందు భగత్ సింగ్ రాసిన లేఖ ఇది (22-03-1931) కామ్రేడ్స్! జీవించి ఉండాలి అన్న కోరిక నాకు లేదు అని చెప్పదలుచు కోలేదు. కాని జీవించడమంటు జరిగ Rating: 0

Related Posts

Leave a Comment

scroll to top