Monday , 20 May 2019

Home » NEW » ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్యం

ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్యం

December 18, 2016 5:40 am by: Category: NEW, Slider News, బాత్ చీత్ Leave a comment A+ / A-

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, శనివారం సాయంత్రం ఖైరతాబాద్ లో వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, టియుడబ్ల్యుజే నేతలు క్రాంతి కిరణ్, పల్లె రవికుమార్ తదితరులు రాష్ర్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు, మరో 3 లక్షలకుపైగా రిటైర్డ్‌ ఉద్యోగులు, దాదాపు 25 వేల మంది జర్నలిస్టులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి 20 లక్షల మందికిపైగా ఉంటారు. నగదు రహిత ఆరోగ్య కార్డున్న ఉద్యోగులు, జర్నలిస్టులు మొత్తం 1,885 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకునేం దుకు అవకాశం ఉంది. వివిధ వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీ సొమ్మును 30 నుంచి 40 శాతం వరకు పెంచుతూ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఈజేహెచ్‌ఎస్‌ సీఈవో పద్మ తెలిపారు. కొన్ని వ్యాధుల ప్యాకేజీలు పెంచామని… మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య ప్యాకేజీ ప్రకారం సరిచేశామని ఆమె తెలిపారు.
వెల్ నెస్ సెంటర్లు త్వరలో జిల్లా కేంద్రాలలో కూడ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలలో ఓపీ సేవలతో పాటు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి.. బ్రాండెడ్ మందులు అందిస్తారు. వ్యాధి ముదిరి ఉంటే.. అత్యవసర చికిత్సల కోసం కార్పొరేట్ దవాఖానలకు పంపిస్తారు. ఇక ఎమర్జెన్సీ సేవలను ప్రధాన సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో జర్నలిస్టులు,ఉద్యోగులు నేరుగా పొందవచ్చు.
హైదరాబాద్ లో కిమ్స్, స్టార్, ప్రైమ్, కాంటినెంటల్, సన్‌షైన్, యశోద (మలక్‌పేట్, సోమాజిగూడ, సికింద్రాబాద్), కేర్ (బంజారాహిల్స్, నాంపల్లి, ముషీరాబాద్), అపోలో (జూబ్లీహిల్స్, హైదర్‌గూడ, సికింద్రాబాద్). గుండె, కిడ్నీలు, లివర్, సర్జికల్, క్యాన్సర్ తదితర 1885 వ్యాధులకు చికిత్సలు పొందవచ్చు.

ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్యం Reviewed by on . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, శనివారం సాయంత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, శనివారం సాయంత Rating: 0
scroll to top