Saturday , 24 August 2019

Home » Slider News » ఈ ప్రశ్నకు బదులేది…..

ఈ ప్రశ్నకు బదులేది…..

October 14, 2016 2:55 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరాం వేసే ప్రశ్నలకు సర్కార్ నుండి సమాధానాలు లేవు. కొత్తగా 31 జిల్లాలు ఏర్పాట్లు చేసి సంబరాల్లో మునిగి తేలుతున్న టిఆర్ ఎస్ సర్కార్ కు కోదండరాం సూటి ప్రశ్నలు వేసాడు.
ధనిక రాష్ట్రం అని, రెవెన్యూ మిగులు అని చెబుతున్నారని ఇవే నిజమైతే పలు బకాయిలు ఎందుకు చెల్లించ లేదని నిల దీశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి రూ.630 కోట్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 4,300 కోట్ల బకాయిలను చెల్లించాల్సి డగా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిం చారు. రైతులకు రుణమాఫీ ఇప్పటిదాకా పూర్తిగా తెల్లించలేదని, ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వలేక పోయారని కోదండరామ్ చేసిన విమర్శలకు టిఆర్ఎస్ నాయకులు సమాధానాలు వెదుక్కునే పనిలో పడ్డారు. కార్పోరేట్ సంస్థలకు పెద్ద పీట వేస్తూ నిధులను దారి మళ్ళిస్తున్నారని కూడ కోదండరాం విమర్శలు చేశారు.

ఈ ప్రశ్నకు బదులేది….. Reviewed by on . తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరాం వేసే ప్రశ్నలకు సర్కార్ నుండి సమాధానాలు లేవు. కొత్తగా 31 జిల్లాలు ఏర్పాట్లు చేసి సంబరాల్లో మునిగి తేలుతున్న టిఆర్ ఎస్ సర్కార్ కు క తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరాం వేసే ప్రశ్నలకు సర్కార్ నుండి సమాధానాలు లేవు. కొత్తగా 31 జిల్లాలు ఏర్పాట్లు చేసి సంబరాల్లో మునిగి తేలుతున్న టిఆర్ ఎస్ సర్కార్ కు క Rating: 0
scroll to top