Friday , 21 September 2018

Home » Slider News » ఇర్మా విధ్వంసం….ఫ్లోరిడా అతలాకుతలం

ఇర్మా విధ్వంసం….ఫ్లోరిడా అతలాకుతలం

September 11, 2017 7:58 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on ఇర్మా విధ్వంసం….ఫ్లోరిడా అతలాకుతలం A+ / A-

hurricane effectఅమెరికా తీర రాష్ట్రం ఫ్లోరిడాను పెను తుపాను ఇర్మా ముంచెత్తింది. కేటగిరీ 4 తీవ్రతతో.. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో కూడిన పెనుగాలులు, కుండపోత వర్షంతో విరుచుకుపడింది. ఫ్లోరిడా కీస్‌ వద్ద ఆదివారం ఉదయం 9.10 గంటలకు (స్థానిక కాలమానం) భయంకర తీవ్రతతో తీరాన్ని తాకిన ఇర్మా.. టాంప, నేపుల్స్, సెయింట్‌ పీటర్స్‌బర్గ్, పోర్ట్‌ మెయర్స్‌లలో పెను విధ్వంసం సృష్టించింది. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణనష్టం ఎక్కువగా జరగకుండా నివారించగలిగినా.. భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు ఇర్మా కారణంగా ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయారు. సహాయ కార్యక్రమాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా సమీక్షించారు.

హరికేన్‌ ఇర్మా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించింది. ఆదివారం సాయంత్రం (భారత కాలమానం) ఫ్లోరిడా కీస్‌ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా ధాటికి ఆ రాష్ట్ర తూర్పు తీరంలో ఊహించని స్థాయిలో ఆస్తినష్టం చోటుచేసుకోగా, ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాకాసి గాలులకు వందలాది చెట్లు నేలకూలగా, భారీ భవంతులు చిగురుటాకుల్లా వణికిపోయాయి. భవనాల అద్దాలు పగలడంతో పాటు వందలాది ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఆస్తినష్టం ఊహించనంతగా ఉందని, ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. తూర్పు తీరంలోని టాంప నగరం, నేపుల్స్, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్, బ్రాడెంటన్, క్లియర్‌వాటర్, పోర్ట్‌ మెయర్స్, సరసోటా పట్టణాలపై హరికేన్‌ విశ్వరూపం చూపిస్తోంది. పశ్చిమ తీరంలో ఉన్న మయామి–డేడ్‌ కౌంటీపై కూడా హరికేన్‌ ప్రభావం కొనసాగింది. వర్షానికి మయామిలో రోడ్లు నీట మునిగాయి. ప్రస్తుతం ఇర్మా స్థాయిని కేటగిరి 3కి తగ్గించారు. ఈ హరికేన్‌ ప్రభావం సోమ, మంగళవారాల్లో ఫ్లోరిడాతో పాటు జార్జియా, అలబామా, దక్షిణ, ఉత్తర కరోలినాల్లో కొనసాగనుంది.

పారిపోయిన ఖైదీలు

క‌రీబియ‌న్ దీవులు, క్యూబాను ముంచెత్తిన హ‌రికేన్ ఇర్మా.. ఇక అమెరికాలోని ఫ్లోరిడాలోని కీస్ వద్ద తీరం దాటింది. ఇర్మా తీరం దాటే స‌మ‌యంలో గంట‌కు 209 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచాయి. ఇర్మా తుఫాను అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇర్మా తుఫాను ధాటికి ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. అలాగే, ద‌క్షిణ ఫ్లొరిడాలోని 4.2 ల‌క్ష‌ల ఇండ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇర్మా తుఫాను ధాటికి ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది మృతి చెందారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లను ప్రారంభించారు.
అయితే, ఇర్మా తుఫాను జైలు ఖైదీలకు ఎంతో మేలు చేసింది. ఏకంగా వందమందికిపైగా ఖైదీలకు విముక్తి ప్రసాదించింది. అట్లాంటిక్ సముద్రంలోని  బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్‌లో ఉన్న జైలు పైభాగం ఇర్మా దెబ్బకు ధ్వంసమైంది. దీంతో దొరికిందే సందని సంబరపడిన ఖైదీలు వెంటనే జైలు నుంచి పరారయ్యారు. వారిని నిలువరించడం అక్కడి గార్డులకు కష్టతరంగా మారడంతో ఖైదీలు గోడదూకి పారిపోతుంటే జైలు సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

 

 

 

ఇర్మా విధ్వంసం….ఫ్లోరిడా అతలాకుతలం Reviewed by on . అమెరికా తీర రాష్ట్రం ఫ్లోరిడాను పెను తుపాను ఇర్మా ముంచెత్తింది. కేటగిరీ 4 తీవ్రతతో.. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో కూడిన పెనుగాలులు, కుండపోత వర్షంతో విరుచుకుపడ అమెరికా తీర రాష్ట్రం ఫ్లోరిడాను పెను తుపాను ఇర్మా ముంచెత్తింది. కేటగిరీ 4 తీవ్రతతో.. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో కూడిన పెనుగాలులు, కుండపోత వర్షంతో విరుచుకుపడ Rating: 0

Related Posts

scroll to top