Tuesday , 25 June 2019

Home » Slider News » ఇదీ ఈ రోజుల్లో విలేఖరి గిరి….

ఇదీ ఈ రోజుల్లో విలేఖరి గిరి….

ఓ సగటు జర్నలిస్టు మిత్రుడు, విలేఖరి తన భాద నంతా ఇట్లా చెప్పుకుంటే ఫేస్ బుక్, వాట్స్ అప్ వంటి సామాజిక మాద్యమాల్లో తిరుగుతోంది
నేను జ‌ర్న‌ లిస్టుని…ఉద్యోగం ఉన్న నిరుద్యోగిని…!
JOURNALIST 1
పేరుకే జ‌ర్నలిస్టుని….కానీ మా ఉద్యోగాలు అస‌లు స్వరూపం తెలిస్తే మా పై వార్తలు రాయ‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌లేరు. ఉదయం లేవ‌గానే ప్రెస్ మీట్ అంటూ పరుగెడ‌తాం…అక్కడ మా కుటుంబ స‌భ్యులే అధికంగా వుంటారు అదే నండి మా తోటి జ‌ర్నలిస్టులు. మా మందిని చూసి ఆ ప్రెస్ మీట్ నిర్వాహ‌కులు క‌నీసం టిఫిన్ కూడా పెట్టరు. అదేమంటే మేము పిలిచింది 20 మందినే కానీ వ‌చ్చింది 60 మంది మంది అందుకే టీ, సాల్టు బిస్కెట్లే తెప్పించామ‌ని ఏమీ అనుకోవ‌ద్దని ఓ వెకిలి న‌వ్వు న‌వ్వు న‌వ్వుతాడు ప్రెస్ మీట్ పెట్టే నిర్వాహ‌కుడు. అక్కడ వాళ్లు ఏం మాట్లాడితే అది రాసుకొని వ‌స్తాం. అటు నుంచి వ‌చ్చేట‌పుడు ఆక‌లి అప్పటికీ ఇంట్లో మా ఆవిడ చెబుతూనే వుంది. ఏమండి ఎండ‌ని ప‌డి వెళుతున్నారు కాస్త చ‌ద్ది అన్నం తిని వెళ్లండ‌ని నేను ప‌ట్టించుకుంటే క‌దా….అలా చెప్పింది కూడా మా మంచికే బియ్యం రేటు బాగా పెరిగిపోయాయ్ రాత్రి మిగిలిన అన్నం బ‌య‌ట ప‌డేయ లేక మా ఆవిడ అలా చెప్పింద‌ని క‌లెక్టరేటుకి వెళుతూ ఆక‌లిగురించి ఆలోచిస్తే త‌ప్ప నాకు తెలియ‌లేదు. ఇంత‌లో క‌లెక్టరేట్ వ‌చ్చింది లోప‌లికి వెలుతుండ‌గానే సార్ న‌మ‌స్తే బాగున్నారా అంటూ అటెండ‌ర్ ప‌ల‌క‌రింపు అంతే ఆక‌లి చ‌చ్చిపోయింది మొహంలో గ‌ర్వం పెరిగిపోయి లోప‌లికి వెళ్లి క‌లెక్టర్ ను క‌లిస్తే అప్పటి వ‌ర‌కూ ఫోన్ ఎత్తని ఆయ‌న కూడా రండి రండి చాలాకాలం అయ్యింది మిమ్మల్ని చూసి అంటూనే ఎవ‌రు బ‌య‌ట రెండు, గానీ కొబ్బరి బొండాలు కానీ తీసుకురండి మ‌న ప్రెస్ మిత్రులు వ‌చ్చార‌ని ఆదేశం. మాట పూర్తి కాలేదు రెండు గ్లాసుల్లో కొబ్బరి నీరు టేంక్సండి అంటూ గ్లాసు నోట్లో పెట్టుకుంటూ ఆలోచ‌న ఇంటి ద‌గ్గర పెళ్లం అడిగింది స‌రుకులు అయి పోయాయి వ‌చ్చే ట‌ప్పుడు తీసుకు ర‌మ్మని, మీరు వ‌చ్చే వ‌ర‌కూ వంట చేయ‌న‌ని అప్పటికి స‌మ‌యం 12 అవుతోంది. గ్లాసు తాగ‌డానికి మ‌న‌సు రాక క‌లెక్టర్ చెప్పింది రాసుకొని బ‌య‌ట‌కొచ్చాం. మార్గ మ‌ద్యలో రాజ‌కీయ నాయ‌కుల ప‌ల‌క‌రింపులు అబ్బో ఎన్నో జ‌రిగాయ్ ఇవ‌న్నీ క‌డుపు నింప‌లేదు. కానీ స్టోరీ మాత్రం దొరికింది. మంచి లైన్ రాసుకొని ఇంటికి ప‌య‌నం అవుతుంటే బండిలో పెట్రోలు అయిపోయింది. స‌రిగ్గా సిటీ మ‌ద్యలో బండి తెలిసిన వాడి షాపుద‌గ్గర పార్కుచేసి, డ‌బ్బులు లేక అక్రిడేష‌న్ బ‌స్సు పాస్ తో ఇంటికెళితే బార్య వంట చేయకుండా ఉన్న నూక‌ల‌తోను, ఇంట్లో రెండు నెల‌ల క్రితం తెచ్చి మ‌రిచిపోయిన దాల్చిన చెక్కతో కిచిడి చేసింది. ఏమండి ఈ రోజైనా డ‌బ్బులు ఏమైనా స‌ర్దు బాటు అయ్యాయా అని దీనంగా అడిగితే…ఏమీ స‌మాదానం చెప్పలేక కాస్త ప‌డుకుండా సాయంత్రం లేపు ఈరోజు స్టోరీ రాయాల‌ని చెప్పి వెళ్లిపోయా.
సాయంత్రం ఆఫీసుకు వెళితే మీటింగ్ ఎందుకో తెలీదు అక్కడ టెలీఫోన్ ఆప‌రేట‌ర్ ని అడిగితే స‌ర్కులేష‌న్, యాడ్స్ కోసం మీటింగ్ అట సార్ అన్నాడు వెంట‌నే గుండెల్లో రాయి. మీటింగులో కూర్చున్నా స్టాఫ్ రిపోర్టర్ 5ల‌క్షల యాడ్సు…300 సంవ‌త్స‌ర చందాలు చేయించాలి. కంట్రిబ్యూట‌ర్ లు ల‌క్ష, రూపాయ‌లు 100 చందాలు చేయించాలి. చందాల డ‌బ్బులు మాత్రం విలేక‌రులే ముందుగా ఆఫీసులో క‌ట్టేయాలి. త‌రువాత వ‌సూలు చేసుకోవాలి లేదంటే అక్రిడేష‌న్ లు తీసేసుకుంటాం. ఇవ‌న్నీ రెండు నెల‌ల్లోగా చేస్తేనే జీతాలు అది కూడా ఒక్క నెల(అప్ప‌టికి6 నెల‌లు జీతం పెండింగ్‌) చేయ‌లేక‌పోయిన వారు ఇక్కడి నుంచే వెన‌క్కి వెళ్లిపోవ‌చ్చు. అంటూ సీరియ‌స్ వార్నింగ్‌. అంత‌కు మూడు నెల‌ల ముందే పెళ్లాం మెడ‌లో తాడు అమ్మి 30వేలు ఆఫీసులో క‌ట్టా. పెళ్లాం మెడ‌లో ప‌సుపుతాడే వుంది. ఇంటి అద్దె నాలుగు నెల‌లు అంటే 12 వేలు బాకీ, పిల్లాడికి స్కూలు ఫీజు 4వేలు క‌ట్టాలి. జీతం వ‌స్తుంద‌నుకుని చేసిన కిరాణా అప్పు 5వేలు దాటింది. చేతిలో చూస్తే చిల్లిగ‌వ్వ కూడా లేదు. ఏంచేయాలో తోచ‌ని ప‌రిస్థితిలో మా అకౌంటెంట్ దేవుడిలా వ‌చ్చాడు. సార్ మీరు రెండే క్రితం వేసిన యాడ్ క‌మిష‌న్ ఇస్తున్నాం తీసుకోండి అని రెండు వేల రూపాయ‌లు చేతిలో పెట్టాడు అదేంటి నాకు రావాల్సింది ప‌దివేలు క‌దా అని అడిగితే మిగిలిన మొత్తం కొత్త చందాలకి ముందుగా ఇడి మీటింగ్ లో క‌ట్టేశాం అన్నారు. క‌ట్టిన చందాల‌కే పేప‌ర్ ప‌డ‌క అంతా డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేయంటే మూడు పేప‌ర్లు మా ఇంట్లోనే వేయించుకుంటున్నా….ఏమ‌ని చెప్పాలి నా జ‌ర్నలిస్టు నిజ‌ జీవిత గాధ‌లు…

ఇదీ ఈ రోజుల్లో విలేఖరి గిరి…. Reviewed by on . ఓ సగటు జర్నలిస్టు మిత్రుడు, విలేఖరి తన భాద నంతా ఇట్లా చెప్పుకుంటే ఫేస్ బుక్, వాట్స్ అప్ వంటి సామాజిక మాద్యమాల్లో తిరుగుతోంది నేను జ‌ర్న‌ లిస్టుని...ఉద్యోగం ఉన్న ఓ సగటు జర్నలిస్టు మిత్రుడు, విలేఖరి తన భాద నంతా ఇట్లా చెప్పుకుంటే ఫేస్ బుక్, వాట్స్ అప్ వంటి సామాజిక మాద్యమాల్లో తిరుగుతోంది నేను జ‌ర్న‌ లిస్టుని...ఉద్యోగం ఉన్న Rating: 0

Related Posts

scroll to top