Tuesday , 12 December 2017

Home » Slider News » ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌

ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌

August 1, 2017 10:39 am by: Category: Slider News, ఫోకస్ Comments Off on ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ A+ / A-
  • 30 అంతస్తుల భవనమంత లోతు.. ఆసియాలోనే పెద్దది
  • కాళేశ్వరంలో సర్జ్‌పూల్‌ ప్రత్యేకత ఇది
sergepool kaleshwaramకరీంనగర్‌: 81 కిలోమీటర్ల అతి పెద్ద సొరంగ మార్గం! ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌! నీటిని పల్లం నుంచి ఎత్తుకు తీసుకెళ్లే ఎత్తిపోతల! ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రత్యేకతలే! వీటిలో సర్జ్‌పూల్‌ ఇంకా విభిన్నం. సర్జ్‌పూల్‌ అంటే మహా బావి! దీని లోతు 92 మీటర్లు. డయా (వ్యాసం) 56 మీటర్లు! అంటే, 30 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో ఈ బావి లోతు అంతన్నమాట! 18 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో.. దీని వ్యాసం దాదాపు అంతన్నమాట! సిరిసిల్ల జిల్లా పరిధిలోని తిప్పాపూర్‌ సమీపంలో మూడు గుట్టల మధ్య దీనిని నిర్మిస్తున్నారు. తిప్పాపూర్‌లో నిర్మించేది ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు. ఎల్లంపల్లికి ఎగువన మధ్యమానేరుపై నిర్మించిన మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ నుంచి మూడు కిలోమీటర్ల కాలువను తవ్వి ఆ తర్వాత 9.5 మీటర్ల డయాతో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ ఒక టీఎంసీ నీరు ఈ మహా బావిలోకి వచ్చి చేరుతుంది. ఇక్కడి నుంచి 106 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమయ్యే నాలుగు మోటార్లతో కూడిన పంపుహౌస్‌ ద్వారా నీటిని ఎగువన ఉన్న అనంతగిరి రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి మల్లన్న సాగర్‌ వరకూ తరలిస్తారు. 92 మీటర్ల లోతైన మహాబావికి గాను ఇప్పటికి 79 మీటర్ల లోతు తవ్వారు. మరో 13 మీటర్ల లోతు తవ్వాల్సి ఉంది.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ Reviewed by on . 30 అంతస్తుల భవనమంత లోతు.. ఆసియాలోనే పెద్దది కాళేశ్వరంలో సర్జ్‌పూల్‌ ప్రత్యేకత ఇది కరీంనగర్‌: 81 కిలోమీటర్ల అతి పెద్ద సొరంగ మార్గం! ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ 30 అంతస్తుల భవనమంత లోతు.. ఆసియాలోనే పెద్దది కాళేశ్వరంలో సర్జ్‌పూల్‌ ప్రత్యేకత ఇది కరీంనగర్‌: 81 కిలోమీటర్ల అతి పెద్ద సొరంగ మార్గం! ఆసియా ఖండంలోనే అతి పెద్ద సర్జ Rating: 0
scroll to top