Sunday , 16 December 2018

Home » Slider News » ఆశ్చర్యం లేదు…కెసిఆర్ ముందుస్తు ఎన్నికల వ్యూహం ?

ఆశ్చర్యం లేదు…కెసిఆర్ ముందుస్తు ఎన్నికల వ్యూహం ?

October 13, 2016 5:15 am by: Category: Slider News, తెలంగాణ Leave a comment A+ / A-

తెలంగాణ రాష్ర్టంలో ఇప్పడి కిప్పుడు ఎన్నికలు జరిగితే…..ఎట్లా ఉంటుంది….వచ్చేదెన్ని…పోయేదెన్ని… ఎన్నికలంటే ఎవరికి ఆసక్తి లేక పోవచ్చు కాని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాత్రం ఎప్పటికప్పుడు లెక్కుల వేస్తున్నాడు. రాష్ర్ట ఆవిర్భావం అనంతరం సరికొత్త వ్యూహాలతో ప్రణాళికలతో పాలన పరుగులెత్తిస్తున్న కెసిఆర్ ప్రజల నాడి కనుక్కోవడంలో కూడ ప్రత్యర్థులకు అంతుచిక్కుండా వ్యవహరిస్తున్నారు. 10 జిల్లాల తెలంగాణ ను 31 జిల్లాల రాష్ర్టంగా చేసి కొత్త అధ్యాయానికి తెర లేపిన సిఎం ఇప్పటి కిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అన్ని సీట్లూ టిఆర్ఎస్ వేననే అంచనాకు వచ్చారట. ఈ మేరకు ఆయన తన దైన పద్దతిలో సర్వే చేయించారో లేక పార్టి వర్గాలతో రిపోర్టులు తెప్పించాడో తెలియదు కాని మంచి ధీమాతో ఉన్నారు. వస్తే గిస్తే ఏ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఎంఐఎం కు మాత్రం నగరంలో ఓ అరడజనుకు పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీతో మంచిగా ఉంటే సరిపోతుందని తన సన్నిహితలకు చెప్పాడట. లెక్క ప్రకారం 2019 లో రాష్ర్టంలో సాదారణ ఎన్నికలు జరగనున్నాయి. ఒక వేళ సిఎం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉండి ఉంటే కొత్తగా అసెంబ్లి నియోజకవర్గాల విభజన జరగకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. అసెంబ్లి నియోజ కవర్గాల పెంపు కోసం అటు ఎపి సిఎం ఇటు తెలంగాణ సిఎం ఇద్దరూ కేంద్రంపై వత్తిడి తెస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు బిల్లు రూపొందించే కసరత్తు కూడ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందే నాటికి మరో ఏడాది కాలం పట్టవచ్చు. కెసిఆర్ అనుకున్నట్లు జరిగితే కొత్త అసెంబ్లి నియోజకవర్గాల ఏర్పాటు అనంతరం…..ఆశ్చర్యం లేదు…..ఓ ఏడాది ముందు ఎన్నికలకు పోయినా పోవచ్చుననే చర్చ జరుగుతోంది.kcr on new distrcts formation

ఆశ్చర్యం లేదు…కెసిఆర్ ముందుస్తు ఎన్నికల వ్యూహం ? Reviewed by on . తెలంగాణ రాష్ర్టంలో ఇప్పడి కిప్పుడు ఎన్నికలు జరిగితే.....ఎట్లా ఉంటుంది....వచ్చేదెన్ని...పోయేదెన్ని... ఎన్నికలంటే ఎవరికి ఆసక్తి లేక పోవచ్చు కాని తెలంగాణ ముఖ్యమంత్ తెలంగాణ రాష్ర్టంలో ఇప్పడి కిప్పుడు ఎన్నికలు జరిగితే.....ఎట్లా ఉంటుంది....వచ్చేదెన్ని...పోయేదెన్ని... ఎన్నికలంటే ఎవరికి ఆసక్తి లేక పోవచ్చు కాని తెలంగాణ ముఖ్యమంత్ Rating: 0
scroll to top