Friday , 16 November 2018

Home » Slider News » ఆన్ లైన్ లో డబ్బులు దోచేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన వరంగల్ కమీషనరేట్ పోలీసులు   

ఆన్ లైన్ లో డబ్బులు దోచేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన వరంగల్ కమీషనరేట్ పోలీసులు   

May 24, 2018 10:50 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on ఆన్ లైన్ లో డబ్బులు దోచేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన వరంగల్ కమీషనరేట్ పోలీసులు    A+ / A-

WARANGAL POLICE COMMISSIONERవరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌తో పాటు, సైబారబాద్‌, రాచకోండ, హైదరాబాద్‌ నగరాల్లో బ్యాంక్‌ ఖాతాదారు ఖాతా నుండి డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా చోరీకి ప్పాడుతున్న నిందితుడుని వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ సైబర్‌ క్రైం పోలీసులు  బుధవారం అరెస్టు చేసారు.

పోలీసులు  అరెస్టు చేసిన నిందితుడి వివరాలు:

గుగులోతు విజయ్‌, తండ్రి పేరు సోమ్లా, వయస్సు 27సం. గ్రామము వెలికట్ట, తోర్రూర్‌ మండం, మహబూబాబాద్‌ జిల్లా, ప్రస్తుత నివాసం బుద్దనగర్‌, ఉప్పల్‌, హైద్రబాద్‌.

నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు వివరాలు:

పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు నుండి సుమారు 30లక్షల విలువ గల 240గ్రాము బంగారం,రెండు ఇంటి స్థల దస్తావేజులు  ఒక ఐ 20 కారు, ఒక ద్వీచక్రవాహనం, 2 ఏసిలు , 2కంప్యూటర్లు, 2 వాషింగ్‌ మిషన్లు, 3 ప్రింటర్లు, ఒక ప్రిజ్‌ , ఒక కెమెరా ఒక ఏల్‌.ఇ.డి టెలివిజన్‌, 6 సెల్‌ఫోన్లు తో పాటు 10కు పైగా వివిధ కంపేనీకు సంబంధించిన సిమ్‌కార్డుతో పాటు 20పైగా సిమ్‌ కార్డు వివరాతో కూడిన పత్రాన్ని పోలీసు స్వాధీనం చేసుకున్నారు. మరియు ఇంకా 200 గ్రాముల  బంగారు అభరణాను స్వాధీనం చేసుకోవాల్సింది వుంది.
కేసు వివరాలు
  సైబర్‌ క్రైం పోలీస్‌ విభాగం అరెస్టు చేసిన నిందితుడు హైదరాబాద్‌లోని ఓ ప్రవైయిట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో బి.టెక్‌ పూర్తి చేసాడు, తన భార్య ఒక పాపతో హైద్రబాద్‌లో ఉప్పల్‌ ప్రాంతంలో నివాసం వుందే వాడు. నిందితుడు బి.టెక్‌ పూర్తి చేయడంతో నగరంలో వివిధ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసేవాడు . నిందితుడు తనకు వచ్చే అదాయంతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సరిపోక  నిందితుడు ఇతర తప్పుడు మార్గాల్లో డబ్బును సంపాదించానే ఆలోచనతో వుండే వాడు. ఇదే క్రమంలో ఒక రోజు హైద్రబాద్‌ నగరంలోని బిగ్‌ బజార్‌ నందు కోద్ది మంది వినియోగదారులు  గిఫ్ట్‌ వోచర్ల ద్వారా వస్తువును కోనుగోలు  చేస్తున్న తీరును గమనించిన నిందితుడు.  వాటి గురించి ఇంటర్‌నేట్‌ ద్వారా పలు   వైబ్‌ సైట్లలో విశ్లేషించి దానికి సెల్‌ నెంబర్‌ మరియు జీ మెయిల్‌ ఖాతా అవసరమని తెసుకోని తన దగ్గర బంధువు సహయంతో తయారు చేసిన నకిలీ గుర్తింపు కార్డుపై వివిధ నెట్‌ వర్క్ లకు  చెందిన సిమ్‌ కార్డుల ను కోనుగోలు  చేసివాటి పై జీ మెయిల్‌ ఖాతాను సృష్టించి నేరాలను చేయడానికి ప్రణాళికను సిద్దం చేసుకోన్నాడు.  ముందుగా తన వ్యక్తిగత డెబిట్‌ కార్డు ద్వారా బిగ్‌ బజారు సంబంధించిన గిఫ్ట్‌ వోచర్లను కోనుగోలు  చేసాడు.
  ఈ విధంగా సుభంగా డబ్బును సంపాదించ వచ్చ అనేది తెలుసుకున్న నిందితుడు ప్రణాళిక  ప్రకారం 2016 సంవత్సరంలో తోలిసారిగా తాను నివాసం వుండే బోడ ఉప్పల్‌ ప్రాంతంలోని ఆంధ్ర బ్యాంక్‌, ఎస్‌.బి.ఐ కి చెందిన ఏ.టి.యం సెంటర్ల వద్ద వెళ్ళి ఏ.టి.యంలో డబ్బు డ్రా చేసుకోనేందుకు వచ్చిన  బ్యాంక్‌ ఖాతాదారులు   డబ్బు డ్రా చేసుకోనే సమయంలో  ఖాతాదారులకు తెలియకుండా వారి ఏ.టి.యం కార్డు నెంబర్‌తో పాటు ఏ.టి.యం పిన్‌ నెంబర్‌ను దోంగచాటుగా చూసి  తన సెల్‌ ఫోన్‌ నందు నమోదు చేసుకునేవాడు. ఈ విధంగా నమోదు చేసుకోన్న ఏ.టి.యం కార్డు మరియు ఏ.టి.యం పిన్‌ నెంబర్లతో దగ్గర్లో వున్న  ఇంటర్‌ నెట్‌ సెంటర్లకు వెళ్ళి వివిధ వెబ్‌ సైట్ల ద్వారా  2వేల , ఒకవేయ్యి రూపాయ విలువ  గల  గిఫ్ట్‌ వోచర్లను బుక్‌ చేసే వాడు. ఈ విధంగా బుక్‌ చేసిన గిఫ్ట్‌ ఓచర్లతో నగరంలోని ప్రముఖ బిగ్‌బజార్‌, జోయాుకాస్‌, రిలియన్స్‌ డిజిటల్‌, బజాజ్‌ ఎలాక్ట్రానిక్స్‌ వంటి వాటిలో బంగారు, ఎలాక్ట్రానిక్‌ గృహోపకరణాను కోనుగోలు  చేసేవాడు. అలాకోనుగోలు  చేసిన బంగారు వస్తువులను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో తన స్వంత అవసరాలను తీర్చుకోనేవాడు.ఈ తరహలో నిందితుడు వరంగల్‌ నగరంలో సుమారు 50 మంది ఖాతాదారుకు పైగా వారి ఏ.టి.యం  కార్డు మరియు ఏ.టి.యం పిన్‌ నెంబర్ల సహయంతో నేరాలకు పాల్పడ్డాడు . ఇదే తరహలో సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకోండ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో 500 మంది ఖాతాదారు ఖాతా నుండి ఆన్‌లైన్‌ ద్వారా గిప్ట్‌ఓచర్ల బుక్‌ చేశాడు.
 వరుసుగా జరుగుతున్న ఈ తరహ మోసాలపై జె.పి.ఎన్‌ రోడ్‌ ఎస్‌.బి.ఐ బ్రాంచ్‌ మేనేజర్‌కు  ఇచ్చిన పిర్యాదు పై స్పందించిన పోలీస్‌ కమీషనర్‌ డా.వి.రవీందర్‌ ఐ.పి.ఎస్‌., ఉత్తర్వుల మేరకు  నూతనంగా నెలక్పోడబడిన సైబర్‌ క్రైం విభాగం ఇన్స్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌ మరియు సిబ్బంది ఈనేరాలపై సైబర్‌ క్రైం ల్యాబ్‌ నందు గల  సాంకేతిక పరికరాలతో  ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితుడు నేరాలకు  పాల్పడిన   తీరుతేన్నల పై  పూర్తి సమాచారాం సేకరించడం తో పాటు నిందితుడి గుర్తించడం జరిగింది. గుర్తించిన నిందితుడి పూర్తి సమాచారాన్ని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌ అధికారులకు అందజేయడంతో ఇంతేజార్‌గంజ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తన సిబ్బందితో జె.పి.ఎన్‌ రోడ్డులోని ఆంధ్రబ్యాంక్‌ మరియు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏ.టి.యం సెంటర్‌ వద్ద నిఘా ఏర్పాటు చేసారు.  నిన్న సాయంత్రం 6గంటల సమయంలో నిందితుడు నేరానికి ప్పాడేందుకు  ఏ.టి.యం వైపు రావడంతో నిందితుడిని పోలీసు అదుపులోకి తీసుకోని విచారించగా  నిందితుడు తాను చేసిన నేరాను పోలీసు ఎదుట అంగీకరించి నేరా వివరాు తొపగా, నిందితుడు గిఫ్ట్‌ ఓచర్ల ద్వారా కోనుగోు చేసిన వస్తువును పోలీసు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్ లైన్ లో డబ్బులు దోచేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన వరంగల్ కమీషనరేట్ పోలీసులు    Reviewed by on . వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌తో పాటు, సైబారబాద్‌, రాచకోండ, హైదరాబాద్‌ నగరాల్లో బ్యాంక్‌ ఖాతాదారు ఖాతా నుండి డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా చోరీకి ప్పాడుతున్న నిందితుడున వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌తో పాటు, సైబారబాద్‌, రాచకోండ, హైదరాబాద్‌ నగరాల్లో బ్యాంక్‌ ఖాతాదారు ఖాతా నుండి డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా చోరీకి ప్పాడుతున్న నిందితుడున Rating: 0
scroll to top