Friday , 21 September 2018

Home » Slider News » అయిలయ్య సార్ ది ప్రశ్నించే తత్వం

అయిలయ్య సార్ ది ప్రశ్నించే తత్వం

September 19, 2017 10:32 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on అయిలయ్య సార్ ది ప్రశ్నించే తత్వం A+ / A-

Kancha-Alaiah-writerకంచె ఐలయ్య గారి టాపిక్ పై నా అభిప్రాయం.

ఆ పుస్తకానికి పేరు “వ్యాపారవేత్తలు ఎలా మొసంచేస్తారో తెలుసా”అనో

“వైష్యులు ఇలా చేస్తే మంచిది” అనో

“చరిత్రలో కోమట్లు” అనో 

పెడితే బాగుండు అని పించింది.

కాని నవమాసాలు మోసి కన్న తల్లికి తన బిడ్డ పేరు తనకు నచ్చినది పెట్టుకునే హక్కు ఎలాఉంటుందో రచయితకు కూడా తాను రాసిన పుస్తకానికి పేరు పెట్టుకునె  ఆ స్వేచ్చ ఉంటది.

ఐనా ఆయన నేను హిందువునెట్లైతా అని రాసినప్పటితో పోలిస్తే ఈ చిల్లర కథలు ఎంత?

చరిత్ర లో రచయితలు రాసిన పుస్తకాల్లో

రద్దైనవెన్ని, నిషేదించినవెన్ని, బయటకు రానివెన్ని,ఇదో లెక్కా

అందుకే అన్నాడేమో మహానుభావుడు నాది అని చెప్పుకోడానికి ఒక దేశం లేదని.

కాకపోతె కొన్ని మాటలు వింటుంటె లోలోపల నవ్వుకుంటున్నాను

ఆయన స్వార్దంకోసం రాసాడట

అసలు భార్యాపిల్లల జంజాటమే పెట్టుకోలేదు ఆయన.

పేరుకీర్తికోసమట హహ ఆయన తిరగని దేశం ఉందా.

ఐనా కీర్తి రావాలంటె పొగుడుతూ రాస్తరుకని ఆలోచింపజేస్తరా

ఆయన తన మేదస్సును పేరుకీర్తిని తాకట్టుపెడితే ఇప్పటికి అటు రాజకీయంగా ఇటు ఆర్దికంగా  ఎక్కడో ఉండేవాడు.

కోమట్లపై పడ్డాడు అంటున్నరు

తెలంగాణ ఉధ్యమం అత్యంత ఉదృతంగా ఉన్నప్పుడె కోదండరాం సార్ ని సైతం సక్కగ పాఠాలు చెప్పండి అన్నారు.

కే.సి. ఆర్.నైనా ప్రధానినైనా ప్రశ్నించె తత్త్వం ఆయనది.

గొల్ల కురుమల మీటింగ్ లోనె గొర్ల మందకాడ కాదు ఇంట్లో పండుకోండన్న వ్యక్తి

క్రిష్ణుడి బొమ్మ తీసేసి బాబాసాహేబ్ బొమ్మ పెట్టమన్నోడు.

సరస్వతమ్మ ఏ యూనివర్సిటీల సదివిందని ప్రశ్నించారు.

ఆయన రాయని అంశం లేదు

సమాజంలోని ప్రతి కోణాన్ని చూసి అనుభవించి చదివి పరిశోధించి రాసినవే

అలా అని ఆయన రాసిందే ఫైనల్ కాదు.

అంతకన్నా గొప్పగా శాస్త్రీయంగా రాసేవరకు ఆయన్ని విస్వసించాల్సిందె

లోపముంటె చర్చించాలి అంతేకాని దూషించడం బెదిరింపులుచేయడం సరికాదు

అతను వ్యక్తికాదు సాహిత్య శిఖరం

తెలుగువారి సంపద ఆయన

కోమట్లు కోపంతో కాకుండా ద్వేషంతో చూడకుండా విజ్ఞతతో ఆలోచించాలని కోరుతున్నాను.

రేపటి రోజున నాస్తిక సంఘంపైన రాసినా

నేను పుట్టిన కులంపైన రాసినా నా స్పందన ఇలాగె ఉంటుంది.

ఆయన రాసిన రచనలన్నీ చదివితె ఈ పుస్తకం వెంటృకతో సమానం

సారీ వెంటృకకాదు ఈకంత కాదు.ఎందుకో ఇంత రాద్దాంతం.

హాయిగ కవితలు రాసుకొని అచ్చేసుకునుడో

రాసినవి చూసుకొని మురుసుడోకాదు

కవుల సంఘాలు కవిసమ్మేళనాలు , సన్మానాలు మాత్రమే కాదు

సమాజాన్ని కదిలించాలి కలం,

వంగి సలాం కొట్టేది గూలామేకాని కలం కాదు.

తలవంచని కంచె ఐలయ్య గారి కలానికి సలాము.

మన్నులో భావాలు దెబ్బతింటాయని వదలకుండా,

మనకెందుకులే అని ఊరుకోకుండా,

ఏమైద్దో అని బెదరకుండా ఉండే

ఆయన చేతివెంట సమాజాన్ని కడిగి శుద్దిచేసే రచనలనేకం రావాలని ఆశిస్తున్నాను.

కోమట్లకు ఆయన ఆవేదన అర్దం కావాలని ఆయన్ని అపార్దం చేసుకోవద్దని

కోరుతూ

మీ నరేష్ భైరి

ప్రచార కార్యదర్శి

భారతనాస్తికసమాజం

Ssf జాతీయ సమన్వయకర్త

9704481800

 

 

అయిలయ్య సార్ ది ప్రశ్నించే తత్వం Reviewed by on . కంచె ఐలయ్య గారి టాపిక్ పై నా అభిప్రాయం. ఆ పుస్తకానికి పేరు "వ్యాపారవేత్తలు ఎలా మొసంచేస్తారో తెలుసా"అనో "వైష్యులు ఇలా చేస్తే మంచిది" అనో "చరిత్రలో కోమట్లు" అనో  కంచె ఐలయ్య గారి టాపిక్ పై నా అభిప్రాయం. ఆ పుస్తకానికి పేరు "వ్యాపారవేత్తలు ఎలా మొసంచేస్తారో తెలుసా"అనో "వైష్యులు ఇలా చేస్తే మంచిది" అనో "చరిత్రలో కోమట్లు" అనో  Rating: 0

Related Posts

scroll to top