Saturday , 25 November 2017

Home » Slider News » అభయ్ కేసు నిందితుల అరెస్టు..సంపన్నులు కావాలనే దురాశతో కిడ్నాప్

అభయ్ కేసు నిందితుల అరెస్టు..సంపన్నులు కావాలనే దురాశతో కిడ్నాప్

March 21, 2016 12:39 am by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

hyd police mahender reddy
నగరం లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంనగర్‌లో నివాసముండే వ్యాపారి రాజ్‌కుమార్ కొడుకు అభయ్‌ హత్యకేసులో మిస్టరీని హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన శేషుకుమార్ అలియాస్ సాయి (20), శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన పోండారా రవి(21), నంబూరి మోహన్ (23)లను పోలీసులు అరెస్టు చేసారు. వీరికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
అభయ్‌ తండ్రి రాజ్ కుమార్ వద్ద కోట్ల రూపాయులు ఉన్నాయని భావించి కిడ్నాప్, హత్య చేెసారు. ఈ కేసుకు విశాఖపట్టణం, రాజమండ్రి ప్రాంతాలలో నిందితులను అదుపులోకి తీసుకొన్నామని సిటి పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.రాజమండ్రి పాంత్రానికి చెందిన సాయి.. రాజ్‌కుమార్ ఇంటికి సమీపంలోని ఓ వ్యాపారి వద్ద వంటమనిషిగా, మరొకరు శివ గోషామహల్‌లో మేస్త్రీగా, మూడోవ్యక్తి రాజు రోజువారీ కూలీగా పనిచేసేవారు. రాత్రికి రాత్రే సంపన్నులు కావాలనే దురాశతో వ్యాపారం నిర్వహించే అభయ్ తండ్రి రాజ్‌కుమార్‌ను ప్లాన్‌కు ఎంచుకుని అభయ్‌ని కిడ్నాప్ చేసి పదికోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అభయ్ నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. చనిపోయిన అభయ్ ను అట్టపెట్టెలో పెట్టి మృతదేహాన్ని తరలించేందుకు హిందీనగర్‌లో ఓ ఆటో ట్రాలీని మాట్లాడుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తరలించారు.అల్ఫా హోటల్ సమీపంలో అట్ట పెట్టెను వదిలేసి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో విజయవాడకు వెళ్లారు. అభయ్ చనిపోయిన అనంతరం కిడ్నాపర్లు రూ 5 కోట్లు ఇవ్వాలంటూ అభయ్ అంటీకి పోన్ చేసారు. డబ్బులు సంపాదించాలనే కోరికతో నిత్యం ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వాటిని చూసేవారని, అందులోని క్రిమినల్ మెథడ్స్ చూసి డబ్బులు సంపాదించుకోవాలని భావించేవారని చెప్పారు.
ఈకేసు చేదించేందుకు నగరంలోని సిసి కెమెరాల పుటేజీలు పోలీసులకు తోడ్పడ్డాయి.

అభయ్ కేసు నిందితుల అరెస్టు..సంపన్నులు కావాలనే దురాశతో కిడ్నాప్ Reviewed by on . నగరం లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంనగర్‌లో నివాసముండే వ్యాపారి రాజ్‌కుమార్ కొడుకు అభయ్‌ హత్యకేసులో మిస్టరీని హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేది నగరం లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంనగర్‌లో నివాసముండే వ్యాపారి రాజ్‌కుమార్ కొడుకు అభయ్‌ హత్యకేసులో మిస్టరీని హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేది Rating: 0

Related Posts

scroll to top