Sunday , 16 December 2018

Home » Slider News » అధికారం మాదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతున్నాం…. కేటీఆర్: సర్వేలలో కారు జోరు

అధికారం మాదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతున్నాం…. కేటీఆర్: సర్వేలలో కారు జోరు

December 7, 2018 6:16 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on అధికారం మాదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతున్నాం…. కేటీఆర్: సర్వేలలో కారు జోరు A+ / A-

Son of CM KCR IT minister KTRతెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ నేత కెసిఆర్ తనయుడు కేటీఆర్  ధీమా వ్యక్తం చేశారు. తమ వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని పోలింగ్ సరళిని బట్టి స్పష్టమైందని చెప్పారు.  ఫలితాలు ప్రబుత్వానికి సానుకూలంగా వస్తాయని 2/3 మెజారిటీతో గెలవనున్నామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మీడియాతో  ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ కు అనుకూలం

ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలవుతున్నాయి. మీడియా సర్వేలు ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలను టైమ్స్‌నౌ విడుదల చేసింది. మొత్తం 119 సీట్లున్న తెలంగాణలో  టీఆర్‌ఎస్‌- 66 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. ప్రజాకూటమికి 37 వస్తాయనీ, బీజేపీ 7 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు మరో 9 చోట్ల గెలుస్తారని వివరించింది. మొత్తంగా టైమ్స్‌నౌ సర్వేలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేస్తోంది.
కాగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలను గెలుచుకుంది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఈ సారి మరో మూడు సీట్లను అధికంగా గెలుచుకుంటుందని చెబుతోంది. బీజేపీ గత ఎన్నికల్లో 5 చోట్ల గెలుపొందింది. ఈ సర్వే ప్రకారం మరో రెండు సీట్లను గెలుచుకుంటోందని తెలుస్తోంది.

 

అధికారం మాదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతున్నాం…. కేటీఆర్: సర్వేలలో కారు జోరు Reviewed by on . తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ నేత కెసిఆర్ తనయుడు కేటీఆర్  ధీమా వ్యక్తం చేశారు. తమ వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని పోలింగ్ సరళి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ నేత కెసిఆర్ తనయుడు కేటీఆర్  ధీమా వ్యక్తం చేశారు. తమ వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని పోలింగ్ సరళి Rating: 0
scroll to top