Sunday , 16 December 2018

Home » Slider News » అందరిలో ఉన్న ప్రేమను వెలికి తీస్తా….రాహుల్ గాంధి

అందరిలో ఉన్న ప్రేమను వెలికి తీస్తా….రాహుల్ గాంధి

July 20, 2018 6:44 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on అందరిలో ఉన్న ప్రేమను వెలికి తీస్తా….రాహుల్ గాంధి A+ / A-

rahul hug pm modi‘మీలో నా మీద ద్వేషం ఉంది. మీరు నన్ను పప్పు అని ఇంకా అనేక దూషణలు చేయొచ్చు. కానీ నాలో మీ పట్ల ద్వేషం లేదు. ఇదే కాంగ్రెస్. మీ అందరినీ ఒక్కొక్కరుగా మారుస్తాను. అందరిలో ఉన్న ప్రేమను వెలికితీస్తాను. అందరినీ కాంగ్రెస్‌‌లోకి మార్చేస్తా”  అఖిల భారత కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రాహూల్ గాంధి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం పై సుదీర్ఘ ప్రసంగం చేసి ముగింపులో అందరిని ఆశ్యర్య పరుస్తూ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీను హత్తుకున్నాడు.

పార్లమెంట్ లోపలా బయటా టీవీలు చూస్తు కూర్చున్న వారందరికి ఒక చోద్యంలా కనిపించింది. ప్రదాన మంత్రి నరేంద్ర మోడీకి రాహుల్ ఏం చేస్తున్నాడో ముందు అర్దం కాలేదు అనంతరం తేరుకుని రాహుల్ గాంధీకి షేక్ హాండ్ ఇచ్చారు.

అంతకు ముందు రాహుల్ గాంధి తన ప్రసంగంలో కేంద్ర ప్రబుత్వ విధానాలను ప్రదానమంత్రి నరేంద్ర మోదీని కడిగి పారేశారు.

లోకసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంది ప్రసంగిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగంలో బాధ తనకు అర్థమైందన్నారు. 21వ దశాబ్దపు రాజకీయ ఆయుధంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధితులని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, ఈ ఆయుధం కారణంగా బాధపడుతోంది ఆంధ్రులు మాత్రమే కాదని, దేశంలో చాలామంది ఉన్నారన్నారు.

దేశ ప్రజలంతా ‘అబద్ధపు హామీల’ దాడులతో బాధపడుతున్నారని.. తొలుత చాలా ఉత్సాహంగా మొదలై, సంతోషంగా అనిపిస్తుంది కానీ తర్వాత షాకులు మొదలవుతాయనిఅన్నారు. ఆ తర్వాత ఎనిమిది గంటలపాటు ప్రసంగం వస్తుందన్నారు.

ఈ ‘అబద్ధపు హామీల’ దాడులతో దేశ రైతాంగం, యువత, దళితులు, ఆదివాసీలు, మహిళలు బాధపడ్డారని వివరించారు.

‘ప్రధానమంత్రి ఏదైనా మాట అన్నారంటే దానిపై నిలబడాలి’ అని గల్లా జయదేవ్ అన్న మాటను గుర్తు చేస్తూ.. దేశం మొత్తం అదే అడుగుతోందని చెప్పారు.

ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.15 లక్షలు జమ చేస్తానన్నది మొదటి అబద్ధపు హామీ అని రాహుల్ గాంధీ విమర్శించారు.

ఉపాధి గురించి మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకోవాలని, బడ్డీ కొట్లు పెట్టుకోవాలని సలహాలు ఇస్తున్నారని బీజేపీ నాయకులను విమర్శించారు.

నల్లధనం వెనక్కు తెస్తానంటూ పెద్దనోట్లు రద్దు చేశారని, దీనివల్ల రైతులు, పేదలు, కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. దీనివల్లనే ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందన్నారు.

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని, జీఎస్టీ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని, అయితే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి వ్యతిరేకించారని నరేంద్ర మోదీని ఉద్దేశించి విమర్శించారు. ఇప్పుడు నరేంద్ర మోదీ జీఎస్టీ తీసుకొచ్చారని, అయితే ఐదు శ్లాబులు పెట్టారని, చిన్నచిన్న వ్యాపారుల ఇళ్లల్లోకి కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారుల్ని పంపిస్తున్నారని అన్నారు.

ప్రధానమంత్రి చిన్న వ్యక్తులతో మాట్లాడరని, ప్రధానమంత్రి మాట్లాడేది సూటు-బూటు వేసుకున్న 15-20 మంది వ్యాపారులతోనేనని ఆరోపించారు.

జియో వంటి వాణిజ్యాంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో వస్తుందని, అలాంటి శక్తులు మోదీకి మద్దతు ఇస్తాయని చెప్పారు.

దేశానికి తాను కాపలాదారునని, దేశానికి కాపలా కాస్తానని ప్రధానమంత్రి చెప్పారని, అయితే అమిత్ షా కుమారుడు జయ్ షా (ఈ పేరును రాహుల్ పలకగానే సభలో అధికారపక్ష సభ్యులు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ పేరు లోక్‌సభ రికార్డుల్లోకి ఎక్కదని స్పీకర్ తెలిపారు) తన ఆస్తుల్ని 16 వేల రెట్లు పెంచుకున్నారని.. అయినా ప్రధానమంత్రి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

 

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో దేశ ప్రజలకు నిజాలుదాచి పెట్టారని రాపుల్ గాంది ఆరోపించారు. ‘‘ప్రధానమంత్రి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. కానీ, ఆయన నా కళ్లలోకి చూడలేకపోతున్నారు. ఆయన ఎక్కడెక్కడో చూస్తున్నారు. నా కళ్లలో కళ్లుపెట్టి ఆయన చూడలేరు’’ అని రాహుల్ అన్నారు.

కాగా, రాహుల్ గాంధీ ఆరోపణలు సరికాదని, ఆయన సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ అన్నారు.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అందరిలాంటి రాజకీయ నాయకులు కాదని, వారు వేరే తరహా నాయకులని రాహుల్ అన్నారు.

తాము అధికారం కోల్పోయేందుకు, అధికారానికి దూరంగా ఉండేందుకు కూడా సిద్ధంగా ఉంటామని, కానీ.. మోదీ, షాలు మాత్రం అధికారం కోల్పోయేందుకు సిద్ధంగా లేరని, వాళ్లు అధికారం కోల్పోయిన వెంటనే వారికి వ్యతిరేకంగా చాలా జరుగుతాయని వారు భయపడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు ఇద్దరూ భయపడుతున్నారని, ఈ భయం దేశంపైన కూడా పడుతోందన్నారు. ఈ భయమే దేశంలో ప్రతి గొంతుకను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు.

 

 

 

 

అందరిలో ఉన్న ప్రేమను వెలికి తీస్తా….రాహుల్ గాంధి Reviewed by on . 'మీలో నా మీద ద్వేషం ఉంది. మీరు నన్ను పప్పు అని ఇంకా అనేక దూషణలు చేయొచ్చు. కానీ నాలో మీ పట్ల ద్వేషం లేదు. ఇదే కాంగ్రెస్. మీ అందరినీ ఒక్కొక్కరుగా మారుస్తాను. అందర 'మీలో నా మీద ద్వేషం ఉంది. మీరు నన్ను పప్పు అని ఇంకా అనేక దూషణలు చేయొచ్చు. కానీ నాలో మీ పట్ల ద్వేషం లేదు. ఇదే కాంగ్రెస్. మీ అందరినీ ఒక్కొక్కరుగా మారుస్తాను. అందర Rating: 0
scroll to top