Friday , 19 July 2019

Home » Slider News » అంచనాలను తలకిందులు చేసే  “అండర్ కరంట్” – అంతుబట్టక బోల్తా పడ్డ ప్రభుత్వాలు

అంచనాలను తలకిందులు చేసే  “అండర్ కరంట్” – అంతుబట్టక బోల్తా పడ్డ ప్రభుత్వాలు

November 30, 2018 7:10 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on అంచనాలను తలకిందులు చేసే  “అండర్ కరంట్” – అంతుబట్టక బోల్తా పడ్డ ప్రభుత్వాలు A+ / A-

political stunts  ఎన్నికల సమయంలో ఒకటి రెండు పదాలను తరుచూ ప్రస్తావిస్తుంటారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అరా తీసినపుడు ఈ పదాలు వింటుంటాం. ఒకటి అండర్ కరెంట్…రెండోది ప్రజావ్యతిరేకత….. అర్దం అయ్యే పరిభాషలో ఈ రెండు పదాల తాత్పర్యం ఒక్కటే. ఎన్నికలు జరుగుతున్న సమయానికి ఆ పార్టి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉందా? ….ప్రజల మూడ్ ఎట్లా ఉంది…అండర్ కరెంట్ ఉందా? అనేది తెల్సుకుంటుంటారు. అండర్ కరెంట్ అయినా ప్రజా వ్యతిరేకత  అయినా అంత సులభంగా ఎవరికి అంచనాకు చిక్కేవి కావు. ఓ నది నీటి ప్రవాహాన్ని అంచనా వేయడం కష్ట మైనట్లే వీటిని కూడ అంచనా వేయలేం. నది నీటి లోపల ప్రవాహం  ఉధృతంగా ఉండి పైన మాత్రం నిశ్చలంగా కనిపిస్తుంది.

అధికారంలో ఉన్న పార్టీకి ప్రజావ్యతిరేకత ఎంత వరకు ఉంది….అపోజిషన్ పార్టీకి ఎంతవరకు అండర్ కరెంట్ తోడ్పతుందనేది అంతుపట్టని అంశం. చాపకింద నీరులా ఇది ప్రవహించి ఎవరూ ఊహించని విదంగా అధికార పక్షం పడి పోయి అపోజిషన్ అధికారం చేజిక్కించుకోవడం జరిగి పోతుంది.  ఇందుకు గత  ఎన్నికల చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మా ఫ్రభుత్వానికి ఢోకా లేదనుకున్న వారికి మైండ్ బ్లాక్ అయ్యే ప్రజా తీర్పులు వెలువడ్డాయి.

తెలుగు ప్రజలను సమ్మోహితులను చేసిన నటనా సార్వభౌముడు ఎన్టీరామారావు అంతటి ప్రజా దరణ కలిగిన వారే పరాజయానికి గురయ్యారు. 1989 లో తిరుగు లేని మెజార్టీతో అత్యధిక సీట్లతో గెలిచి అధికారం నిలుపుకుంటానని ఆశించిన ఎన్టీరామారావుకు ఊహించని షాక్ తగిలింది. సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి కాంగ్రేస్ పార్టీ పగ్గాలు చేపట్టిన మర్రి చెన్నా రెడ్డి నాయకత్వంలో పార్టి అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రేస్ పార్టీ 181 సీట్లు గెలుచుకుని మర్రి చెన్నారెడ్డి మఖ్యమంత్రిగా ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీ 74 సీట్లు గెలిచి అసెంబ్లీలో అధికారం కోల్పోయి అపోజిషన్ సీట్లలో కూర్చోవాల్సి వచ్చింది. అంత ప్రజాధరణ కలిగిన ఎన్టీరామారావుకే ప్రజావ్యతిరేకత తప్ప లేదు.

ప్రజలు ఇష్ట పడినంత మేరకు ప్రభుత్వాలు మనుగడలో ఉంటాయి. ఇష్టం లేకుంటే బ్రహ్మరథం పట్టిన ప్రజలే ప్రభుత్వాలను చల్లగా సాగనంపుతారు. భారత రాజకీయాలలో తిరుగు లేని నాయకురాలిగా ఎదిగిన డైనమిక్ లేడి ఇందిరా గాంధీకి కూడ ప్రజా వ్యతిరేకత తప్పలేదు. ఇందిరా గాంధి నియంతృత్వ పోకడలను ప్రజా వ్యతిరేక విధానాలను  వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం “సంపూర్ణ విప్లవానికి” పిలుపునిచ్చిన వ్యక్తి  లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్.  దేశంలో విపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చి న వ్యక్తి జయప్రకాశ్ నారాయణ్. ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన కేసులో అలహాబాద్ హైకోర్టు  1975 లో ఇందిరా గాంధిని దోషిగా నిర్దారించగా ఆమె రాజీనామా చేయాలని జయప్రకాశ్ పట్టుబడితే  అధి సహించలేక ఇందిరా గాంధి ప్రతి పక్షాలను అణిచి వేసేందుకు ఎమర్జెన్సి విధించి భారత రాజకీయాల్లో చీకటి అధ్యాయానికి తెర లేపింది. జూన్ జూన్ 25,1975 అత్యవసర పరిస్థితి అమల్లోకి తెచ్చి జయప్రకాశ్ సహా ఇతర ప్రతిపక్ష నేతలను  అందరిని అరెస్టు చేసి జైళ్ళలో కుక్కింది.  1977 లో జరిగిన ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఏర్పడిన జనతాపార్టి ఇందిరా గాంధితో తలపడగా ఆమె చిత్తుగా ఓడిపోయింది. ఎమర్జెన్సీలో అనేక ప్రజోపయోగ పనులు చేశానని బాంకులు జాతీయం చేశానని బ్లాక్ మార్కెట్ అరికట్టానని ప్రజా ధరణ తనకే ఉందని  భావించిన ఇందిరా గాంధీకి ప్రజా వ్యతిరేకత అర్దం కాక అధికారం నిలువక  ఆఖరికి చేసిన తప్పులకు  జైళుకెళ్లాల్సి వచ్చింది.

ప్రస్తుత అంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడుకు కూడ ప్రజల షాక్ తప్పలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టంలో ముందు ముందు తనదే ఏకచ్ఛత్రాది పత్యమని అన్నారు. తాను ఆదర్శ వంతమైన పాలన కొనసాగిస్తున్నానని పశ్చిమ బెంగాళ్ రాష్ర్టంలో కమ్యునిస్టు నేత జ్యోతి బసు కన్నా మించి మరో  25 సంవత్సరాలు తానే అధికారంలో ఉంటానని ప్రకటించుకున్న  చంద్రబాబుకు 2004 ఎన్నికలలో ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పలేదు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రేస్, తెలంగాణ రాష్ర్ట సమితి కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. 234 స్థానాలలో పోటి చేసిన కాంగ్రేస్ కు 185 స్ఠానాలు 54 స్థానాలలో పోటి చేసిన టిఆర్ఎస్ కు 26 స్థానాలు రాగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి 47 స్థానాలు మాత్రమే వచ్చి  అధికార పీఠం వదిలి అపోజిషన్ లో కూర్చోవాల్సి వచ్చింది. చాలాకాలం పాటు చంద్రబాబు నాయుడు పరాజయం దెబ్బ నుండి కోలుకోలేక పోయాడు. 2009 సంవత్సరంలో కూడ చంద్రబాబు నాయుడు అధికారం లోకి రాలేక పోయాడు. రాజకీయాలు తలకిందులై  2009 అదే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ర్ట సమితితో పొత్తు పెట్టుకున్నారు. తెరాసకు 10 అసెంబ్లి సీట్లు మాత్రమే వచ్చాయి. సిని నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టి చీల్చిన ఓట్లు ఉపకరించిన కారణంగా కాంగ్రేస్ 157 స్థానాలలో గెలిచి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి అధికారం నిలుపు కున్నారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన అనంతరం 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ 63 స్థానాలు గెలిచి తొలి తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన ఘనత స్వంతం చేసుకున్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదంతో జరిగింది. 14 సంవత్సరాలు నిర్విరామంగా ప్రజల వెంట ఉండి పోరాడిన కెసిఆర్ కు ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన ఇచ్చిన బహుమానం ఇది. అయితే ఆయన పాలన ఎట్లా ఉందో ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీర్పును ఇవ్వ బోతున్నారు. ప్రజాధరణ బాగానే ఉందని అంచనా వేసి ముందస్తు ఎన్నికలకు  తొందర పడిన  చంద్రశేఖర్ రావు పరిస్థితి ఏమిటో ప్రజలు నిర్ణయించ బోతున్నారు.

కెసిఆర్ ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగానే పోరును ఎదుర్కుంటున్నారు. ఎంఐఎం తో అవగాహనతో ఆ పార్టి పోటి చేసే 7 స్థానాలను మినహాయించి 119 స్థానాలలో మిగతాఅన్ని స్థానాలకు పోటీలో ఉన్నారు. కూటమి కట్టిన విపక్షాల నుండే కాక లోపాయికారి అవగాహన ఉందని అనుకున్న భారతీయ జనతాపార్టీ నుండి కూడ కెసిఆర్ ఈ ఎన్నికల్లో ఎదురు దాడిని  ఎదుర్కోవాల్సి వస్తున్నది.

ఈ పరిస్థితుల్లో రాష్ర్టంలో తెలంగాణ రాష్ర్ట సమితి పార్టి భవిష్యత్ ఆ పార్టి సారధి కెసిఆర్ భవితవ్యం ఎట్లా ఉండబోతుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ ఎన్నికల్లో జరిగినన్ని సర్వేలు బహుశా ఇతర ఏ ఎన్నికల్లో జరగ లేదనే చెప్పాలి. కెసిఆరే స్వయంగా చేయించుకున్న సర్వేలంటూ వార్తలు వచ్చాయి.. ఆయనే స్వయంగా తన సర్వేల ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయని  పార్టి సమావేశాలలో చెప్పుకున్నారు.  అనూకల వ్యతిరేక సర్వేల సంగతి అటుంచితే ఈ సర్వేలు నూటికి నూరు శాతం నిజం ఆయిన దాఖలాలు తక్కువ. ఇందుకు  2015 లో జరిగిన ఢిల్లీ ఎన్నికలే ఉదాహరణ. ఆమ్అద్మిపార్టి ఏ సర్వేల కందకుండా 67 సీట్లతో 54.3 ఓట్లు దక్కించుకుని అనూహ్యంగా అధికారం లోకి వచ్చింది. ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించుకున్న  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కేవలం మూడే మూడుసీట్లు దక్కాయి. ఈ మద్య జరిగిన కర్నాటక రాష్ర్టంలో జరిగిన ఎన్నికలలో కూడ  బిజెపి అథికారం తమదే నని ప్రకటించుకున్నా ఆశలు నెర వేర లేదు. కాంగ్రేస్ జనతా దళ్ ఎస్  కూటమి అధికారం లోకి వచ్చింది.

సో…. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ రాష్ర్టంలో కూడ అధికార పక్షం అంచనాలు తప్పబోవనే గ్యారంటి లేదు. పాలకులపై ఉండే ప్రజా వ్యతిరేకత ఎన్నికల ఫలితాలలోనే బహిర్గతం అవుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడ అధికార పార్టీపై వ్యతిరేకత ఉండి అండర్ కరెంట్ ఉండి ఉంటే  ఫలితాలు ఎవరూ ఊహించని రీతిలోనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దినపత్రిక 30-11-2018

అంచనాలను తలకిందులు చేసే  “అండర్ కరంట్” – అంతుబట్టక బోల్తా పడ్డ ప్రభుత్వాలు Reviewed by on .   ఎన్నికల సమయంలో ఒకటి రెండు పదాలను తరుచూ ప్రస్తావిస్తుంటారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అరా తీసినపుడు ఈ పదాలు వింటుంటాం. ఒకటి అండర్ కరెంట్...రెండోది ప్రజావ్యతిర   ఎన్నికల సమయంలో ఒకటి రెండు పదాలను తరుచూ ప్రస్తావిస్తుంటారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అరా తీసినపుడు ఈ పదాలు వింటుంటాం. ఒకటి అండర్ కరెంట్...రెండోది ప్రజావ్యతిర Rating: 0
scroll to top